ICDS ప్రాజెక్టు డైరెక్టర్ గా జివి.సత్యవాణి..
Ens Balu
1
Kakinada
2021-03-16 17:39:14
తూర్పుగోదావరి జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నూతనంగా భాద్యతలు స్వీవకరించిన జివి. సత్యవాణి మంగళవారం ఉదయం కలెక్టర్ కారాల్యయంలో కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్లు జి లక్ష్మీశ , కీర్తి చేకూరి, జి రాజకుమారి లను మర్యాదపూర్వకంగా కలిసారు.జివి సత్యవాణి డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉపాధి, శిక్షణ సొసైటీ - ఏలూరు , పశ్చిమ గోదావరి ( SETWEL) చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వివిధ పదవుల్లో పని చేయడంతో జిల్లా పై పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ అనుభవంతో ఐసీడీఎస్ ద్వారా మరిన్ని సేవలను అందించి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు క్రుషి చేస్తానని అన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుస్ఫగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు.