పొట్టి శ్రీరాములు త్యాగనిరతి స్ఫూర్తి దాయకం..
Ens Balu
2
Vizianagaram
2021-03-16 18:38:33
ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కొనియాడారు. ఆయన చేసిన త్యాగం చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, కలెక్టరేట్ ఆడిటోరియంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, చరిత్ర పుటల్లో కొందరికి మాత్రమే శాశ్వత స్థానం లభిస్తుందని, అటువంటి అరుదైన వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు ఒకరని పేర్కొన్నారు. తెలుగువారి మనసులో శ్రీరాములు చిరస్మరణీయ స్థానాన్ని సముపార్జించారని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలు ఆదర్శనీయమన్నారు. అందుకే శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టి గౌరవించుకోవడం జరిగిందన్నారు.
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వరి, బిసి కార్పొరేషన్ ఇడి ఆర్‌వి నాగరాణి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధరావు, జిల్లా సహకార అధికారి ఎస్.అప్పలనాయుడు, సమాచార, పౌర సంబంధాల శాఖ ఎడి డి.రమేష్, డిప్యుటీ డిఎంఅండ్‌హెచ్ఓ జె.రవికుమార్, పర్యటకాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్; ఇతర అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.