అభివ్రుద్ధి మరింతం వేగంగా జరగాలి..
Ens Balu
4
Visakhapatnam
2021-03-16 19:12:02
ప్రభుత్వ, అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లతో క్యాంప్ కార్యాలయం నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధిహామీ పథకం, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు (గ్రామీణ), ఇళ్లపట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాల ప్రారంభం పురోగతి, నాడు – నేడు, స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, మల్టీ పర్పస్ వినియోగంపై భూ సేకరణ, వైద్య కళాశాలలు, రహదారులు, భవనాలు, వై.యస్ఆర్. భీమా, జగనన్న తోడు, వై.యస్.ఆర్. చేయూత మరియు వై.యస్.ఆర్ ఆసరా పురోగతి, రబీ ప్రొక్యూర్ మెంట్, ఖరీఫ్ ప్రిపరేషన్, జగనన్న విద్యా దీవెన, వాలంటీర్ ఫెసిలిటీస్, వాలంటీర్ ఫెలిసిటేషన్, తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, ఎస్.పి. బి. కృష్ణారావు, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం. వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, ఆర్. గోవిందరావు, డిఆర్డిఎ పిడి వి. విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జె.డి. రమణమూర్తి, వ్యవసాయ శాఖ జె.డి. లీలావతి, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, మెప్మా పిడి శ్రీనివాసరావు, పంచాయితిరాజ్ ఎస్.ఇ. సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.