మహీధర కెమికల్స్ రూ.10 లక్షల విరాళం..
Ens Balu
3
Andhra University
2021-03-16 19:18:09
ఆంధ్రవిశ్వవిద్యాలయానికి మహీధర కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ 10 లక్షలు విరాళంగా అందించింది. మంగళవారం ఉదయం సంస్థ ప్రతినిధి, పర్చేజ్ మేనేజర్ ఎం.సూర్య నారాయణ రాజు సంస్థ తరపున రూ 10 లక్షల చెక్‌ను ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌కు అందజేశారు. ఈ నిధులను ఏయూలో ఏర్పాటు చేస్తున్న ఇంక్యుబేషన్ సెంటర్‌లో యుటిలిటీ సెంటర్ ఏర్పాటుకు వెచ్చించాలని వీరు కోరారు. విశ్వవిద్యాలయం చేపడుతున్న విప్లవాత్మక కార్యక్రమాలకు తమ వంతు సహాకారంగా దీనిని అందించామన్నారు. భవిష్యత్తులో విద్యార్థులను ఆవిష్కర్తలుగా, యువ పారిశ్రామిక వేత్తలుగా నిలపే కార్యక్రమాలకు తాము సహకారం అందించడం ఆనందాన్నిచ్చిందన్నారు. తమ సంస్థ సామాజిక బాధ్యతగా ఉన్నత విద్యను, యువతను ప్రోత్సహించే ఉద్దేశంగా దీనిని అందించామన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ మాట్లాడుతూ ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఉపయుక్తంగా నిధులు అందించడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు వర్సిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం మరింత సహకారం అందిస్తూ, వర్సిటీ ప్రగతిలో భాగం కావాలని కోరారు.