టెండరులో లారీ యజమానులు పాల్గోవాలి..
Ens Balu
4
Kakinada
2021-03-16 19:30:13
పౌరసరఫరాల శాఖకు సంబంధించి స్టేజ్ -1 మూమెంట్ ట్రాన్స్ పోర్టేషన్ టెండర్ ప్రక్రియలో లారీ ఓనర్స్ ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి లక్ష్మీ శ లారీ ఓనర్స్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి లక్ష్మి శ స్టేజ్ - 1 ట్రాన్స్ పోర్టేషన్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ,సివిల్ సప్లై అధికారులు, లారీ ఓనర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ బఫర్ గోడౌన్ నుంచి మండల స్థాయి గోడౌన్ లకు బియ్యం పంపిణీలో లారీ ఓనర్స్ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు.బియ్యం తరలింపు ట్రాన్స్పోర్ట్ ,సివిల్ సప్లై అధికారులు, లారీ ఓనర్స్ ప్రతినిధులతో సమన్వయం చేసుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన తెలిపారు. స్టేజ్ -1 మూమెంట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి లారీ ఓనర్స్ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియపరచాలని జేసి లారీ ఓనర్స్ కు సూచించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై డీఎం ఈ లక్ష్మి రెడ్డి ,ఆర్టీవో ఆర్ సురేష్, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబ్జి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.