అన్ని హంగులతో కౌన్సిల్ హాలు సిద్ధం..
Ens Balu
5
Visakhapatnam
2021-03-17 18:03:40
అన్ని హంగులతో కౌన్సిల్ హాలు సిద్దం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధారిటి వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. గురువారం మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయంలోని 2వ అంతస్తులోని కౌన్సిల్ హాలులో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో ఏ లోపం ఉండరాదని అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎక్స్ ఆఫీసియో సభ్యులు, ఎన్నికైన వార్డు సభ్యులు హాజరు అవుతారని చెప్పారు. ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సభ్యులంతా ఉదయం గం.10.30 ని.లకే చేరుకోవాలన్నారు. మేయర్ అభ్యర్థికి గుర్తింపు పొందిన పార్టీ సభ్యులు వివిధ ఫారాలు ద్వారా ప్రతిపాదనలు అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జివియంసి కమీషనర్ నాగలక్ష్మి , విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, అదనపు కమీషనర్లు ఆశాజ్యోతి, రమణి, చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు, తదితర అధికారులు పాల్గొన్నారు.