వై.ఎస్.ఆర్.సంపూర్ణ పోషణ సకాలంలో అందించాలి..


Ens Balu
1
Komarada
2021-03-17 18:07:22

పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్య మంత్రి వై ఎస్ ఆర్ సంపూర్ణ పోషణా ప్లస్ పథకం ప్రేవేశ పెట్టారని, పథకం సక్రమంగా అమలు చేసే విధంగా అందరూ విధులు నిర్వహించాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి బుధవారం తన పర్యటనలో భాగంగా కొమరాడ మండలం, కుమ్మరిగుంట పంచాయతీ కంబవలస అంగన్వాడీ కేంద్రం ఆకస్మికంగా పర్యటించారు. ప్రాజెక్ట్ అధికారి అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. పిల్లల హాజరు పట్టి పరిశీలించారు 17 మంది పిల్లలకు గాను పూర్తి స్థాయి లో పిల్లలు ఉండడం వారు మంచి ఉషారుగా ఉండడం చూసి సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు నిర్వహణ బాగుంది అన్నారు. ప్రతి ఒక్కరు విధులు అంకితభావంతో నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రం, పరిసరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు అందజేస్తున్న పౌష్టిక ఆహారం సంబందించిన రికార్డులు పరిశీలించి రికార్డుల నిర్వహణ కు సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి కొమరాడ మండలం గుమడ సచివాలయంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ,అభివృధి పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను నియమాలను అందరూ తప్పక అనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించాలని, సమయపాలన పాటిస్తూ సమయానికి విధులకు హాజరు కావాలన్నారు. పిర్యాదులు సేకరణ,పరిష్కారంలో ఆలసత్వం ప్రదర్శించ వద్దని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది హాజరుపట్టి, ప్రగతి నివేదికలు పరిశీలించారు వోలెంటరీ.వ్యవస్థను సక్రమంగా వినియోగంచు కోవాలని హితవపలికారు.         ఈ పర్యటనలో కొమరాడ తహశీల్దార్ ప్రసాద రావు, పార్వతీపురం అదనపు సి.డి.పి.ఓ సత్యవతి కంబవలస అంగన్వాడీ సిబ్బంది, గుమడ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.