ఆ ప్రాంతంలో పనులు ప్రారంభం కావాలి..


Ens Balu
3
Srikakulam
2021-03-17 19:00:20

శ్రీకాకుళం జిల్లాలో భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల భూసేకరణపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. హై లెవెల్ కెనాల్, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టుల క్రింద జరుగుతున్న పనులను సమీక్షించారు. సకాలంలో పనులు పూర్తి కావాలని, పంటలకు సాగునీటి ఇబ్బందులు తలెత్తరాదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వంశధార ఎస్ఇ డోల తిరుమల రావు, ఇఇ రామచంద్ర రావు, ఎస్డీసీలు బి.శాంతి, కాశివిశ్వనాథ రావు, జి.సుజాత, సంబంధిత తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.