పుట్టినరోజు గుర్తుగా మొక్కలు నాటాలి..


Ens Balu
1
Vizianagaram
2021-03-19 16:45:15

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లో ప్రతీ విద్యార్థి తన పుట్టినరోజు న మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం చెప్పట్టారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్. హనుమంతు లజిపతి రాయ్ గారు యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి పుట్టిన రోజున మొక్కను నాటి తదుపరి పుట్టిన రోజు వరకు దాని సంరక్షణ బాధ్యత  ను చేపట్టాలని సూచించారు. యూనివర్సిటీ లో చేరిన విద్యార్థులు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ వ్యవధిలో ప్రతి సంవత్సరం మొక్కలు నాటి వాటి పెరుగుదలను వీక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ లో BBA కోర్స్ చదువుతున్న విద్యార్ధిని భావన చేత మొక్కను నాటి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు ఎస్. ప్రభాకర రావు ,  ఎన్.వి. సూర్యనారాయణ గారు మరియు విద్యార్థులు పాల్గున్నారు.