APIIC, NAOBకి భూ సేకరణ వేగవంతం..


Ens Balu
1
Visakhapatnam
2021-03-19 20:25:04

విశాఖజిల్లాలో ఎ.పి.ఐ.ఐ.సి., ఎన్.ఎ.ఒ.బి.ల కొరకు చేపట్టిన   భూ సేకరణ  పనులు వేగవంతం చేయాలని  జాయింట్ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరణ  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఎ.పి.ఐ.ఐ.సి.నకు సంబంధించి రాజయ్యపేట, వేంపాడు, చందనాడ, డి.ఎల్.పురం గ్రామమునకు పెండింగ్ లో ఉన్న భూ సేకరణ విషయము మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. అవసరమైనచోట గ్రామ సభలు నిర్వహించి స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో  పెండింగ్ లో ఉన్న భూ సేకరణ, ఆర్. & ఆర్ ప్యాకేజి అంశములు పరిష్కరించాలన్నారు. ఎన్.ఓ.బి. ప్రాజక్ట్ నకు సంబంధించి పెండింగ్ ఆర్.ఆర్ ప్యాకేజి అంశములు ఏప్రిల్ 15తేది లోగా పూర్తీ చేయాలన్నారు. లబ్దిదారుల ఎంపికకు అనగా రెవిన్యూ, మత్స్యశాఖ, ఎన్.ఎ.ఓ.బి, తదితర శాఖల అధికారులతో బృందాలు వేసి అర్హులైన లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ఎన్.మౌర్య, అనకాపల్లి, ఆర్.డి.ఓ సీతారామారావు,  విశాఖపట్నం,  ఎ.పి.ఐ.ఐ.సి. , స్టీల్ ప్లాంట్, ఎన్.హెచ్.16, ఎన్.ఎ.ఓ.బి.ల ప్రత్యేక ఉప కలెక్టర్లు, నక్కపల్లి, రాంబిల్లి, ఎస్. రాయవరం, తహసిల్దార్లు, విద్యుత్ శాఖ, ఆర్.&బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.