సదుపాయాలు కల్పిస్తాం - మెరుగైన సేవలు అందించండి
Ens Balu
2
Srikakulam
2020-08-24 20:23:56
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కోవిడ్ విభాగంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ డాక్టర్లను కోరారు. సోమ వారం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులు, పిజి వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రిలో చేరిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించుటకు సిద్ధంగా ఉన్నామని అయితే ఆయా విభాగాలకు చెందిన వైద్యులు పూర్తిగా అంకితభావంతో పనిచేసి మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరు సంతృప్తితో ఉండాలని అన్నారు. కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లాలని ఆయన చెప్పారు. కరోనా విషయాలను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి మానసిక స్థైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు స్పంది స్తూ అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని విభాగాలకు సంబంధించిన యంత్ర పరికరాలు కొంత మేరకు అవసరం ఉంద ని వాటిని సమకూర్చాలని కోరారు. ప్రతిరోజూ 20 నుండి 30 కేసులు ఆస్పత్రికి వస్తున్నాయని వాటిలో దాదాపు ఐదు కేసులు చివరి దశలు ఉన్నవి వస్తున్నా యని వివరించారు. అదే విధంగా ఎం.ఎన్. ఓలు, ఎఫ్. ఎన్. ఓ లకు విభాగాలలో నియామకాలకు ముందు తగిన శిక్షణ కల్పించాలని ఆయన సూచించారు.