విశాఖజిల్లాలో వేగంగా ఓటర్ల నమోదు..జిల్లా కలెక్టర్


Ens Balu
4
Visakhapatnam
2020-08-25 19:21:42

విశాఖపట్నం జిల్లాలో ఓటర్ల నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతున్నదని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం అమరావతి  నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేశామన్నారు. ఖాళీగా ఉన్న సహాయ ఎలక్టోరల్ అధికారుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్  మాట్లాడుతూ, జనవరి15 నాటికి  ఓటర్ల జాబితాలు ప్రచురించడానికి  చర్యలు తీసుకోవాలని ఎన్నికల   అధికారులను ఆదేశించారు.   ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల దరఖాస్తులను జనవరి5 నాటికి పరిష్కరించాలన్నారు.రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ని బూత్ స్థాయి అధికారులుగా నియమించాలన్నారు. నియోజకవర్గ ఇ.ఆర్.ఓ లు లేనిచోట సీనియర్ అధికారులను ఇ.ఆర్.ఓ లుగా  నియమించాలన్నారు.రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కొరకు ప్రతిపాదనలు పంపాలన్నారు.   ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు నమోదయ్యెందుకు   సెప్టెంబర్28,29 తేదీలు, నవంబర్ 12,13 తేదీల్లో  స్పెషల్ క్యాంపన్ డేస్ గా  విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.  రాష్ట్రంలో యువతకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, నియోజకవర్గాల ఈ ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు