2వ డోస్ వాక్సిన్ వేయించుకున్న స్పీకర్..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-04-22 13:05:11
కోవిడ్ వ్యాప్తికి కారణమవుతున్న జన సమూహాలు, సామూహిక మార్కెట్ నిర్వహణను వికేంద్రీకరణ చేసేందుకు రాష్ర పశుసంవర్దక, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పల రాజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. గురువారం ఉదయం 6:30 గంటలకు అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి పట్టణ ప్రధాన రహదారులలో పారిశుద్య పనులు, మార్కెట్ ను మంత్రి పరిశీలించారు. పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి కాశీబుగ్గ మార్కెట్ లో పరిశీలించి జన సమూహాలను చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుండే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ మార్కెట్ ను బంకేశ్వరి ఆలయం నుండి కాశీబుగ్గ పెట్రోల్ బంక్ వైపు రోడ్లకు ఇరు వైపులా తరలించి మార్కెట్ ను వికేంద్రీకరించాలన్నారు. చిరు వ్యాపారులు దీనిపై పరిశీలించాలని కోరినప్పటికి కోవిడ్ నియంత్రణ దృష్ట్యా మార్కెట్ ను తరలించి వికేంద్రీకరణ చేయడం తప్పదని దీనిని అర్థం చేసుకోవాలని మంత్రి వారికి తెలియజేయడంతో సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బందికి సూచన చేస్తూ మార్కెట్ తరలింపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలంతా గమనించాలని బంకేశ్వరి ఆలయం దగ్గరకు మార్కెట్ ను తరలించిన విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసారు. నిత్యావసరాల కొనుగోలుకు ఇంటి నుండి ఒక్కరు మాత్రమే మార్కెట్ కు రావాలని, అనవసరంగా రోడ్లపై ఎవరు తిరగవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ మాత్రమే మనల్ని రక్షిస్తుందని అన్నారు. ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి కోవిడ్ నియంత్రణకు సహకరించాలని, తప్పని సరిగా మస్కులు ధరించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.