వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు..


Ens Balu
5
విశాఖపట్నం
2021-04-25 09:17:05

ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలకు ప్రాణవాయునిచ్చే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే యోచన విడనాడాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు, ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జేఏసి చైర్మన్ ఏవీ నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. శనివారం విశాఖలోని కూర్మన్నపాలెం స్టీలు ప్లాంట్ గేటువద్ద స్టీలు ఉద్యోగులు ఏర్పాటు చేసిన  పాల్గొని స్టీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది ప్రాణాలు దారపోసి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంలో సాధించుకున్న స్టీలు ప్లాంటును కేంద్రం ఇపుడు ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేంద్రం తన ప్రైవేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన మరింత ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ సెంటిమెంట్ విశాఖ ఉక్కు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. అభివ్రుద్ధి చేయడానికి ఎంతో అవకాశం వున్న ఈ సంస్థను ఖాయాలపడిన కేంద్ర సంస్థగా గుర్తించడం చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి.దయామణి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి కె.జగన్మోహనరావు, ఏపీ యునైటెడ్ విలేజ్ హెల్త్  సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రతినిధులు మోహిని, రాజ్యలక్ష్మి, నాగమణి, రాణి, విజయకుమారి   తదితరులు పాల్గొన్నారు.