కోవిడ్ పోజిటివ్ వచ్చిన ఏ ఒక్కరూ భయాందోళనలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. కుటుంభం లో ఒకరికి పోజిటివ్ వస్తే ఆ కుటుంభం అంతా పోజిటివ్ గానే భావించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదివారం కోవిడ్ పై ప్రత్యేకాధికారి సత్యనారాయణ ఆధ్వర్యం లో సంయుక్త కలెక్టర్లు, వైద్య పోలీస్ శాఖల అధికారులతో కలెక్టర్ కోవిడ్ పరిస్థితులు, పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దత, వాక్సినేషన్ తదితర అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోజిటివ్ వచ్చిన వారు ఆసుపత్రులకు వెళ్లి ఆక్సిజన్ , ఇంజక్షన్ కావాలని ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎలాంటి కేసు కు ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలో వైద్యులు నిర్ణయిస్తారని తెలిపారు. మానసిక ధైర్యంగా ఉండాలని, ఆత్మ స్థైర్యాన్ని పెంచుకొని మందులు వాడితే వ్యాధి పోతుందని అన్నారు. ఎలాంటి దీర్ఘ కాలిక వ్యాధులు లేని వారైతే హోం ఇసోలేషణ్ లోనే ఉండి మంచి ఆహారాన్ని తీసుకొని, యోగా, ధ్యానం లాంటివి చేస్తూ, కుటుంభ సభ్యులతో కలవకుండా భౌతిక దూరాన్ని పాటిస్తే సరిపోతుందని అన్నారు. కుటుంభ సభ్యులెవ్వరు కూడా బయట తిరగరాదని స్పష్టం చేసారు. ఈ విషయం పై గ్రామాల్లో, మున్సిపాలిటీ పరిధి లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇందుకోసం సర్పంచ్ లు, వార్డ్ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయాలనీ అధికారులకు సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో రోజు వారి బెడ్స్ అందుబాటు పై మీడియా లో బులిటెన్ ప్రతి రోజు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు ఎంత మంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంత మంది డిస్చార్జ్ అయ్యారు, ఎన్ని బెడ్స్ ఖాళీ గా ఉన్నాయో వివరాలను ప్రతి ఆసుపత్రి ముందు డిస్ప్లే చేయాలనీ, ఆ సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కు, మీడియా కు అందజేయాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికీ, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని, శాంపిల్ కలెక్షన్ , ఫలితాల వెల్లడి, ఆన్లైన్ నమోదు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు.
కోవిడ్ వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ధరల వివరాలను ఆసుపత్రుల్లో డిస్ప్లే చేయాలనీ సూచించారు. మే నెలలో శుభ కార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున కళ్యాణ మండపాలకు అనుమతుల విషయం లో రెవిన్యూ, పోలీస్ శాఖ ల వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కోవిడ్ కారణంగా ఫంక్షన్ హాల్స్ ధరలు పెంచినట్లయితే వారి పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కరోనా విధులకు, పారిశుధ్యం, అవగాహన తదితర విధులలో సచివాలయ సిబ్బందిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు కు సూచించారు.
సోమవారం నుండి జిల్లాలో మరో 30 వేల మందికి కోవీ షీల్డ్ వాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వాక్సిన్ మొదటి, రెండవ డోస్ లకు వేస్తారని, ప్రతి సి.హెచ్.సి, , ఫై. హెచ్.సి ల పరిధి లోను అందుబాటు లో ఉంటుందని తెలిపారు. 45 ఏళ్ళు నిండిన వారు ఈ వాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్.వి. రమణ కుమారి, అదనపు ఎస్.పి సత్యనారాయణ, ఆసుపత్రుల సమన్వయా ధికారి డా. నాగభూషణ, సూపరింటెండెంట్ డా. గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.