అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు..


Ens Balu
2
అనంతపురం
2021-04-25 13:49:15

కోవిడ్ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తే జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. ఆదివారం కోవిడ్ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్లు, పెనుకొండ సబ్ కలెక్టర్  ఆర్ డి వో లు, నోడల్ ఆఫీసర్ లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం వెళితే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఒక హాస్పిటల్లో రెమిడెసివిర్ ఆరు డోసులకు లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు తెలిసిందన్నారు. రెమిడెసివిర్ కు రూ..2500 ల చొప్పున 6 డోసులకు , మిగిలిన అన్ని ఛార్జీలు కలుపుకున్న రూ.20వేల నుండి రూ.30 వేల వరకు ఖర్చవుతుందని, అయితే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా ఒక రూపాయి ఎక్కువ వసూలు చేసినా అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   హెల్ప్ డెస్క్ మేనేజర్లు ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలోనూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ప్రదర్శించాలని, ఏ చికిత్సకు ఎంత డబ్బులు వసూలు చేయాలో అంత మాత్రమే వసూలు చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అధికంగా డబ్బులు వసూలు చేయరాదన్నారు. ఈ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు ఉన్నాయి, ఎన్ని ఐసీయూ, నాన్ ఐసీయూ పడకలు ఉన్నాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి అనే వివరాలను కూడా ప్రదర్శించాలన్నారు. అందుకు సంబంధించిన ఫోటో లను తనకు పంపించాలన్నారు

కోవిడ్ మేనేజ్మెంట్ పై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

కోవిడ్ మేనేజ్మెంట్ పై నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సరిగా లేదని, శాని సరిగా లేదని తన దృష్టికి వస్తున్నాయన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా  అన్ని అంశాలకు సంబంధించిన నోడల్ అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో లు కోవిడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా, భోజనం ఏర్పాట్లు, శానిటేషన్ ఏర్పాట్లు తదితర అంశాలలో ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. కరోనా సోకిన వారికి పాజిటివ్ వచ్చాక వారితో మాట్లాడడం, ఏఎన్ఎం, ఆశావర్కర్లు పాజిటివ్ వచ్చిన వారి వద్దకు వెళ్లి సమాచారం సేకరించడం, వారికి అవసరమైన కిట్లు అందించడం చేయాలని, మెడికల్ ఆఫీసర్లు యాక్టివ్ గా పని చేయాలన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు పాజిటివ్ రిజల్ట్ వచ్చాక ఎక్కడెక్కడ పాజిటివ్ కేసులు వచ్చాయి, మెడికల్ అధికారులు,ఏఎన్ఎం, ఆశావర్కర్లు వారి వద్దకు వెళ్తున్నారా లేదా అనేది పరిశీలించాలన్నారు. పాజిటివ్ వచ్చినవారిని హోమ్ ఐసోలేషన్ లో పెట్టాక వారికి మెడికల్ కిట్స్ ఇచ్చారా లేదా అనే దాని పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

ఆస్పత్రుల నోడల్ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి

ప్రతి హాస్పిటల్ కు నోడల్ అధికారిని నియమించామని , ఆయా హాస్పిటల్ లకు నియమించిన నోడల్ అధికారులు హాస్పిటల్ లో కోవిడ్ మేనేజ్మెంట్ పై పూర్తి స్థాయి పర్యవేక్షణ చే సేలా చర్యలు తీసుకోవాలని   హాస్పిటల్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి వరప్రసాద్ ను ఆదేశించారు.ఆస్పత్రిలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు , బెడ్స్ అందుబాటు తదితర సమాచారాన్ని సంబంధిత నోడల్ అధికారులు  తెలియజేయాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి భోజనం సమయం వరకు హాస్పిటల్ నోడల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన ఆస్పత్రుల్లో ఉండాలని, లేకపోతే వారిపై  కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రులకు నోడల్ ఆఫీసర్లు సరిగా వెళ్లడం లేదని, సక్రమంగా స్పందించడం లేదని రాష్ట్ర స్థాయి నుంచి, కంట్రోల్ రూం నుంచి ఫోన్లు వస్తున్నాయని, అలాకాకుండా నోడల్ ఆఫీసర్లు ఆసుపత్రులకు సక్రమంగా వెళ్లాలని సూచించారు.హెల్ప్ డెస్క్ మేనేజర్లు సక్రమంగా పనిచేసేలా చూడాల ని హాస్పిటల్ నోడల్ అధికారులను ఆదేశించారు.. 

నోడల్ ఆఫీసర్ లు సమన్వయం చేసుకుని పని చేయాలి

కోవిడ్ నేపథ్యంలో టెస్టింగ్, కేర్ అండ్ కౌన్సిలింగ్, కోవిడ్ కేర్ సెంటర్లు, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలా అన్ని రకాల అంశాలకు సంబంధించి నోడల్ ఆఫీసర్ లను నియమించామని, నోడల్ అధికారులు అంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. పాజిటివ్ వచ్చాక కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఫోన్ చేసి హోమ్ ఐసోలేషన్ లో ఉంటారా లేక కోవిడ్ కేర్ సెంటర్ కి వెళ్తారా, లక్షణాలనుబట్టి ఆస్పత్రికి తరలించాలా అనేది నిర్ణయించాలని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో మెడికల్ అధికారులు, తహసీల్దార్ ల నుంచి సహకారం అందించాలన్నారు.

ఆక్సిజన్ వృధాను అరికట్టాలి

కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఆసుపత్రికి సంబంధించి  ఆక్సిజన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశామని, పాజిటివ్ వచ్చినవారికి ఎంత స్థాయిలో ఆక్సిజన్ అవసరం అని గైడ్ లైన్స్ ప్రకారం  పెట్టాలన్నారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ మాస్క్ ను పెట్టేసి అలా వదిలేసి వెళ్ళడం లేక పోతే పాజిటివ్ వ్యక్తులు మాస్క్ తీసేసి పక్కన పెట్టినా చూసుకోక పోవడం వల్ల ఆక్సిజన్ చాలా వృధా జరుగుతోందన్నారు.ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోతున్నారని పరిస్థితిని అర్థం చేసుకుని ఆక్సిజన్ వృధాను అరికట్టాలని సూచించారు. 

104 కాల్ సెంటర్ గురించి అందరికీ తెలియజేయాలి 

కరోనా నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ గురించి ప్రజలందరికీ తెలియజేయాలని, కరోనా గురించి ఏ సమాచారానికైనా, ఎలాంటి వివరాలు కావాలన్నా 104 కి కాల్ చేస్తే వైద్యానికి సంబంధించిన ఏ సమాచారం అయినా అందుతుందన్న విషయాన్ని  ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  కరోనా లక్షణాలు ఉంటే ఏం చేయాలి టెస్ట్ కు ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్లతో మాట్లాడించడం, హోమ్ ఐ సొలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అన్ని సలహాలు,సమాచారం 104కు ఫోన్ చేస్తే అందుతుంద న్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు.. కరోనా  నివారణకు టీమ్ అనంతపురం బాగా పని చేయాలని, కరోనాని అరికట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.