విజయనగరం జిల్లా పశు సంవర్థకశాఖ సంయుక్త సంచాలకులుగా ఆ శాఖ డిప్యుటీ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ శనివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జెడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంవిఏ నర్సింహులు ఏప్రెల్ 30న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో అదేశాఖలో డిప్యుటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వైవి రమణ, జెడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.