ఆపరేటర్ల పట్ల అర్భన్ తహశీల్దార్ ఉదారత..


Ens Balu
4
విశాఖ
2021-05-01 15:23:10

విశాఖలో కరోనా వైరస్ కేసులు విస్తారంగా పెరుగుతున్న వేళ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి  ఎంతో ఉన్నతంగా మంచి మనసుతో ఎండీయు ఆపరేటర్ల పట్ల తన సేవగుణాన్ని చాటుకున్నారు.. ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసే వారు ఎప్పుడూ ఆరోగ్యంగా, కరోనా వైరస్ కి దూరంగా ఉండాలనే ఆలోచనతో వారందరికీ శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, స్వీట్ బాక్సులు, కిట్లను మేడే సందర్భంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ జ్ణాణవేణి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్న సమయంలో కూడా ఆపరేటర్లు ప్రజలకు ఎంతో దైర్యంగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలనే ఆలోచనతో తనవంతుగా ఈ సహాయం చేసినట్టు  చెప్పారు. , ప్రజలంతా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు వెళ్లవద్దని సూచించారు. నిత్యం మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న  కరోనా వేక్సినేషన్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న ఆమె, ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించినా దగ్గర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. కరోనా వైరస్ ను దైర్యంగా తిప్పికొట్టడంలో విశాఖనగర ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.