మధ్యాహ్నాం 2.30 వరకే అప్పన్న దర్శనం..


Ens Balu
1
సింహాచలం
2021-05-01 15:51:35

కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న ద్రుష్ట్యా మే2వ తేది నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని   శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దర్శనాలు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నాం 2.30 వరకే అనుమతిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. శనివారం దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. మొత్తం 22 మంది ఆలయ అర్చకుల్లో 14 మంది అనారోగ్య కారణాల వల్ల సెలవులో ఉన్నారన్నారు. కరోనా కాకపోయినా ఆ లక్షణాలు ఉన్నా జాగ్రత్తల కోసం సెలవుల్లో ఉన్నారని వివరించారు. ఉద్యోగులకు, అర్చకులకు కరోనీ పరీక్షలు చేశారని ఇంకా ఫలితాలు రావాల్సి వుందన్నారు. కాగా స్వామివారికి నిర్వహించే సేవలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారని వివరించారు. భక్తులు స్వామివారి ఆలయ దర్శనం సమయాలను గమనించి కేవలం ఉదయం పూట మాత్రమే రావాలన్నారు.