శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ మొదటి విడత బిల్లులు తక్షణం సమర్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేస్తూ మొదటి విడత కోవిడ్ సమయంలో వివిధ సామగ్రి పంపిణీ చేసిన ఏజెన్సీలు బిల్లులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ బిల్లులు సమర్పించాలని కోరడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు కొన్ని ఏజెన్సీలు బిల్లులు సమర్పించలేదని ఆయన అన్నారు. బిల్లులు సమర్పించుటకు చివరి అవకాశం కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. బిల్లులను మే 5వ తేదీ నాటికి సమర్పించాలని, గడువు దాటిన తరువాత సమర్పించిన బిల్లులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేసారు.