అప్పటి వరకూ ఆర్టీఓ పనులకు బ్రేక్..


Ens Balu
6
విజయనగరం
2021-05-01 16:35:38

 విజయనగరం రవాణా శాఖ కార్యాలయంలో, లెర్నర్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన సంబంధిత ఫిట్నెస్,  ఇతర పనులు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ సి.హెచ్. శ్రీదేవి తెలిపారు. కరోనా రెండో విడత విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రవాణా కమిషనరు ఆదేశాలు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం అనగా 3.5.2021 నుంచి 31.5.2021 వరకూ రవాణా శాఖ కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారుల నుంచి వచ్చే తదుపరి ఆదేశాల మేరకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆమె వివరించారు. ప్రజలకు అవసరమైన సమాచారం కోసం ఆదినారాయణ ఆర్టీవో  9154294202,  కృష్ణమోహన్ ఏవో 9848528305, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ జె.రాంకుమార్ 9154294411 , ఎం.బుచ్చిరాజు 9154294412 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.

సిఫార్సు