బౌధ కట్టడాల రక్షణ ఉద్యమానికి సిపిఎం మద్దతు..
Ens Balu
3
Jagadamba Junction
2020-08-26 17:49:58
చారిత్రాత్మక బౌధ కట్టడాల తొట్లకొండపై రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రాజధానికి గ్రేహౌండ్ ఆఫీసు, గవర్నర్, ముఖ్యమంత్రి గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలకు 300 ఎకరాలు కేటాయించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపిఎం జిల్లా కార్యదర్శి డా.బి.గంగారామ్ అన్నారు. బుధవారం బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బౌధరామాలు రక్షణకు చేస్తున్న పోరాటంలో వామపక్షాలుగా సిపిఎం పార్టీ మద్దతిచ్చి పోరాడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్.నరసింగరావు సైతం కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, కో కన్వీనర్ ఎం మల్లయ్యరాజు మాట్లాడుతూ, సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తొట్లకొండ గత 30 ఏళ్లుగా అనేక అక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీటిని పరిరక్షించుకోవడానికి అనేక ఉద్యమాలు చేసిన నేపధ్యంలో ఈ అక్రమాలను నిలువరించగలిగామన్నారు.