కరోనాను మనోధైర్యంతోనే తిప్పికొట్టాలి..


Ens Balu
3
విశాఖపట్నం
2021-05-02 04:28:15

విశాఖలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వ అధికారులు ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నారు..జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సూచనలతో ప్రతీ ఒక్క అధికారి ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించడానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి కరోనా వైరస్ పట్ల ప్రజలను చైతన్య పరచడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతూనే పలు సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. కరోనా వైరస్ ను దైర్యంగా జయించడానికి ప్రతీ ఒక్కరూ మనోధైర్యంతో ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తాను స్వయంగా చెప్పడంతోపాటు, తన కింది స్థాయి అధికారులను కూడా ప్రజల్లోకి వెళ్లే సమయంలో వారిలో దైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు సేవలు అందించడానికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని, అవసరం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కుటుంబాల్లోని వయసు మళ్లిన వారిని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. కరోనా ఉన్నంత కాలం కాచిన నీళ్లను తాగాలని, మాస్కును తీయకుండా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, ఏ పనిచేసినా చేతులు సబ్బుతో పరిశుభ్రంగా చేసుకోవాలని, ఎలాంటి కరోనా లక్షణం ఉన్నా వెంటనే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు హోం ఐసోలేషన్ కిట్లను తీసుకొని ఇంట్లో గానీ, పరిస్థితి బాగోలేకపోతే  ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించే వైద్య సహాయాలు పొందాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాయాలకు వచ్చే ప్రజలను కూడా ఈమె తరచుగా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. తన కార్యాలయంలో శానిటైజర్లు ఏర్పాటు చేయడంతోపాటు, ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను అమలు చేస్తున్నారు. విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్ణానవేణి కరోనా వైరస్ పట్ల చేస్తున్న ఈ ఆదర్శవంతమైన చైతన్యం, సూచనలతో పట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభించడం విశేషం.
సిఫార్సు