సీఎస్ఆర్ బ్లాక్ లో ల్యాబ్ ఏర్పాటు చేయండి..


Ens Balu
2
కలెక్టరేట్
2021-05-03 13:56:02

కె.జి.హెచ్ సి.ఎస్.ఆర్. బ్లాకులో కోవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందించడంలో ఎటువంటి లోటు పాట్లు వుండరాదని. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనపరచాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరు సి.ఎస్.ఆర్.బ్లాకులో వైద్య సేవలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ల డిశ్చార్జి, ఎక్వీప్ మెంటు , టెస్టింగ్ ఏజెన్సీ  ఏర్పాట్లు గావించిడం, తదితర అంశాలపై  చర్చించారు. సి.ఎస్.ఆర్ బ్లాకు ప్రత్యేకాధికారిగా  ఎస్. వెంకటేశ్వర్, పి.ఒ.ఐ.టి.డి.ఎ.పాడేరు ను  కలెక్టరు నియమించారు. సి.ఎస్.ఆర్.బ్లాకు లో వైద్యసేవలు, కోలుకుంటున్న పేషెంట్లు డిసార్చి గావించడం అన్ని విషయాలపై  ప్రత్యేక శ్రద్ద వహించాలని పి.ఒ. ఐ.టి.డి.ఎ.ను ఆదేశించారు. పేషెంట్లసు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పి.పి.పి. క్రింద టెస్టింట్ ఏజెన్సీని గుర్తించాలని ఆదేశించారు. ఈ టెస్టింగ్ ఏజెన్సీని సి.ఎస్.ఆర్.బ్లాకు లోనే ఏర్పాటు గావించాలన్నారు.  పేషెంట్లను చేర్చుకునే విషయంలో టెస్టింగ్ ముఖ్యం కాదని, కోవిడ్  లక్షణాలు  వుంటే చేర్చుకుని అవసరమైన వైద్యసేవలు అందించాలని సూచించారు.  ఇ.సి.జి., ఎక్స్ రే , డయాలసిస్ మొదలగు టెక్నీషియన్స్ ను నియమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు –2 పి.అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డా.పి.వి.సుధాకర్,  పి.ఒ. ఐ.టి.డి.ఎ. ఎస్ .వెంకటేశ్వర్ , తదితరులు హాజరయ్యారు.

హెల్త్ సిటీ, విమ్స్ లకు ఆక్సిజన్ సరఫరా 
జిల్లాలో హెల్త్ సిటీలోని ఆసుపత్రులు కోవిడ్  పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నాయని,  వాటికి ఆక్సిజన్ సరఫరాకు ఎటువంటి  ఇబ్బంది లేకుండా చూడాలని  డ్రగ్ ఇన్స్పెక్టర్లు రజిత, కళ్యాణిలను జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఆదేశించారు. హెల్త్ సిటి ఆసుపత్రులకు  ఆక్సిజన్ అవసరాలను  దృష్టిలో  పెట్టుకొని తగు ఏర్పాట్లు గావించాలన్నారు.  విమ్స్ ఆసుపత్రిలో అన్ని పడకలకు ఆక్సిజన్ సరఫరాకు తగు ఏర్పాట్లు చేయాలని ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ.డి.ఎ.నాయుడును ఆదేశించారు. ఈ విషయంపై కలెక్టరు ఎ.పి.ఎమ్.ఎస్.ఐ.డి.సి. ఇ.ఇ. డి.ఎ.నాయుడును, ప్రత్యేకాధికారి ఎస్.ఎస్.ఎ.పి.ఒ.లతో చర్చించారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులనన్నింటిని  ప్రతిరోజూ పరిశీలన గావించి కోవిడ్ పేషెంట్లకు అవసరమైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ డి.సి.హెచ్.ఎస్. లక్ష్మణ్ ను ఆదేశించారు. సదరు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ , సేవలు, వివరాలను తెలియజేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సి.హెచ్.సి.లలో వున్న పల్మనాలజిస్టలను  కె.జి.హెచ్.కు డెప్యూట్ గావించాలన్నారు.  ప్రైవేటు ఆసపత్రులను  తనిఖీ నిర్వహించాలని, నిబంధనలు ప్రకారం ఖాళీ పడకల వివరాలను 104 కాల్ సెంటర్ ఇంచార్జికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని  డి.ఎమ్ అండ్.హెచ్.ఒ.ను  ఆదేశించారు.  ప్రైవేటు ఆసుపత్రులకు  ఇచ్చిన నోటీసులపై వారి వివరాలను వెంటనే అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.సూర్యనారాయణ, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా.రాజేష్ పాల్గొన్నారు.

సిఫార్సు