కోవిడ్ వార్డులో మెరుగైన సేవలు..


Ens Balu
3
కెజీహెచ్
2021-05-03 13:58:35

కె జి.హెచ్ కోవిడ్ వార్డులో  కోవిడ్ బాధితులకు  మెరుగైన వైద్య సేవలు అందించాలని కోవిడ్  నోడల్ అధికారి ,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు సోమవారం కేజీహెచ్ నోడల్ అధికారిగా గారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా  కోవిడ్ విభాగం అధికారులతో సమీక్షించారు.
కోవిడ్ పేషేంట్లకు నాణ్యమైన  ఆహారపదార్థాలు అందించాలన్నారు. తాగునీటి ని ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని సూచించారు. అన్ని కోవిడ్ వార్డుల్లో అవసరమైన వెంటిలేటర్ లు ,బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పేషెంట్ బంధువులు ఎక్కువమంది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేషేంట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సహాయక కేంద్రానికి అందించాలని పేర్కొన్నారు.
నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి వార్డులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి షిప్టులోను60 మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహించాలని చెప్పారు
ఇటీవల కోవిడ్ సేవలకు నియమించిన డాక్టర్లు, సిబ్బంది వెంటనే విధులకు చేరాలన్నారు.కోవిడ్ బాధితులకు నిరంతరం ఆక్సిజన్ అందించాలన్నారు. సి ఎస్ ఆర్ బ్లాక్ లో ఏర్పడ్డ చిన్న చిన్న మరమ్మతులు చేయాలని  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ పేషెంట్ మృతి చెందితే 30 నిమిషాల్లో వార్డ్ నుంచి బయటకు తరలించాలని చెప్పారు. కోవిడ్ పరిక్షలకు నమూనాలను సేకరించి కేజీహెచ్లోనే పరీక్షలు నిర్వహించి జాప్యం చేయకుండా ఫలితాలు వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ మైథిలి ఏ సి పి శిరీష  తదితరులు పాల్గొన్నారు.