ప్రతీరోజూ ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీ..


Ens Balu
1
కలెక్టరేట్
2021-05-03 14:02:38

ప్రతీ రోజు ప్రైవేటు ఆసుపత్రులను ఇన్స్పెక్ట్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ లను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదేశించారు.  సోమవారం ఆసుపత్రుల్లోని ఖాళీ పడకలు, ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలు గూర్చి జిల్లా జాయింట్ కలెక్టర్ - 2 పి.అరుణ్ బాబు, ఎ.ఎం.సి. ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ లతో ఆయన కలసి సమీక్షించారు.     104 కాల్ సెంటర్ రియల్ టైంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని పడకలు ఉన్నది, తదితర వివరాలు అప్ డేట్ గావించాలని సర్వే శాఖ ఎ. డి., మనిషా త్రిపాఠీ లను ఆదేశించారు. ఆసుపత్రుల్లో పడకలు కాలీ అయితే ఖాళీ అని చూపిస్తే అడ్మిషన్ టోకెన్లు డిఆర్డిఎ పిడి, 104 నోడల్ అధికారి విశ్వేశ్వరరావు జారీ చేస్తారని వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల జాబితాను నోటిఫై చేయాలని, అందులో కేటగిరి-ఎ శత శాతం కోవిడ్ ఆసుపత్రులని, కేటగిరి - బి 50 శాతం కోవిడ్ ఆసుపత్రులని పేర్కొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న పడకల సంఖ్య పక్కాగా తెలియాలని ఆదేశించారు. ప్రతీ రోజు ఉదయమే ప్రైవేటు ఆసుపత్రులను సందర్శించి ఏ ఆసుపత్రిలో, ఏ ఫ్లోర్ లో ఎన్ని పడకలు, ఎంత మంది పేషెంట్లు ఉన్నదీ తెలియజేయాలని డిఎంహెచ్ఓ, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ లను ఆదేశించారు. విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా మరింత పేంచేందుకు, పడకలపై చర్చించారు.   ఈ సమావేశంలో డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సూర్యనారాయణ, జిల్లా ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు