104 కాల్ సెంటర్ ఆకస్మిక తనిఖీ..


Ens Balu
3
కలెక్టరేట్
2021-05-03 15:10:56

104 కాల్ సెంటర్ కు వచ్చే కాల్స్ కి పరిష్కారం చూపించడంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, ఎప్పటికప్పుడు కాల్స్ కి రెస్పాండై ఫిర్యాదులను పరిష్కరించేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ ఐసి భవనంలో కోవిడ్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను ఎటువంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సిబ్బంది పని చేయాలన్నారు. 104 కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులపై 30 నిమిషాల్లోపు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రయారిటీ ప్రకారం పరిష్కారం చూపించాలన్నారు. 104 కాల్ సెంటర్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి చేస్తున్న పని పై క్లారిటీ ఉండాలన్నారు. ఫిర్యాదులను ఎటువంటి పెండింగ్ లేకుండా పరిష్కరించేలా పని చేయాలన్నారు. 104 ఉద్యోగులు అంత బాగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అవి పని చేసేలా చూడాలని, విజువల్స్ ను నిత్యం పరిశీలన చేయాలన్నారు. అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా విజివల్స్ ని ఖచ్చితంగా పరిశీలించాలని, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని పరిశీలన చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాల ద్వారా విజివల్స్ 104 కాల్ సెంటర్ లో కనిపించేలా చూడాలని సూచించారు. ఏజెన్సీ వారితో మాట్లాడి కోవిడ్ ఆస్పత్రుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కోవిడ్ 19 హాస్పిటల్ యాప్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో ఏ ప్రాంతం నుంచి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి అనేది పరిశీలించి, వెంటనే ఒక ఫిర్యాదు కూడా పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్, డి ఈ ఓ ప్రేమ్ కుమార్, సిసి టివి మానిటరింగ్ డిపిఎంఓ సురేష్, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్ మూర్తి, 104 కాల్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు