రేషన్ పంపిణీ వేగంగా జరగాలి..


Ens Balu
1
కలెక్టరేట్
2021-05-03 15:12:35

 కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని రేషన్  బియ్యాన్ని వేగంగా పంపిణీ చేయాలనీ సంయుక్త కలెక్టర్ డా. జి.సి కిషోర్ కుమార్  సూచించారు.   సోమవారం తన ఛాంబర్ లో సంబంధిత అధికారులు, ఎం. డి. యు  ఆపరేటర్ల తో రేషన్ పంపిణీ పై  సమీక్షించారు.   ఎం. డి యు ఆపరేటర్లకు  కరోనా  సోకకుండా ఉండేలా సానిటైసర్ లు, మాస్క్ లు, గ్లౌస్ లను అందజేయడం  జరిగిందని తెలిపారు. కరోనా నివారణా పద్ధతులన్నీ వినియోగిస్తూ రేషన్ పంపిణీ చేయాలన్నారు.   రెగ్యులర్ గా ఇచ్చే 5 కేజీ లతో పాటు కోవిడ్ కారణంగా అందించే మరో 5 కేజీ లను కుడా కలుపుకొని 10 కేజీ లను  ఈ నెల అందజేయాలని   ఆదేశించారు.  జిల్లాలో నున్న 6 లక్షల 95 వేల 821  కార్డు దారులకు ఈ లబ్ది చేకూరనుందని తెలిపారు. 
ఈ సమావేశం లో  రెవిన్యూ డివిజినల్ అధికారి సి.హెచ్. భవాని శంకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, ఎస్.సి కార్పొరేషన్ ఈ.డి జగన్నాధ రావు,  ఎం.డి.యు ఆపరేటర్ ల ప్రతినిధులు పాల్గొన్నారు. 
సిఫార్సు