సాయినారు బాధితులకు చెక్కులు పంపిణీ..మంత్రి


Ens Balu
6
Visakhapatnam
2020-08-26 17:59:22

విశాఖజిల్లా పరవాడ సాయినారు లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో  జూన్ నెలలో జరిగిన  విషవాయువు లీక్ సంఘటనలో భాదితులకు చెక్కులను బుధవారం సితమ్మధార  క్యాంపు కార్యాలయంలో  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కంపెనీలు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాయినారు లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తూ విషవాయువు లీక్ ఘటనలో  నాగేంద్ర రావి మృతి చెందగా  ప్రభుత్వం ఎక్స్ గ్రేషియోను ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొరికి రూ.50 లక్షలు ప్రకటించారు. దానికి సంబంధించి మృతుని భార్య విజయలక్ష్మి కి రూ.35 లక్షల చెక్కును తల్లిదండ్రులకు రూ.15 లక్షలు చెక్కును అందజేశారు.ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకరికి ఇంతకుముందే ఎక్సగ్రేషియో సంబందించిన చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి.కిషోర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.