సింహాద్రి అప్పన్న దర్శన వేళల్లో మార్పులు..
Ens Balu
1
సింహాచలం
2021-05-03 15:22:08
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులకు స్వామివారి దర్శనాల్లో మార్పులు చేశారు. భక్తులను ఉదయం 6:30 గంటల నుంచి 11:30(AM)వరకు మాత్రమే దర్శనాలకి అనుమతిస్తారు. స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు ఏకాంతంగానే జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు తెలియజేశారు. స్వామివారి దర్శనాల్లో మార్పులను భక్తులు గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.