రెవిన్యూ సేవలు పూర్తిస్థాయిలో అందేలా పనిచేయాలి..
Ens Balu
2
Visakhapatnam
2020-08-26 18:09:14
విశాఖ జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ని సీతమ్మధార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో రెవిన్యూ సమస్యలపై తక్షణమే స్పందించి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందిలా చూడాలని డీఆర్వోకి సూచించారు. ప్రజలు రెవిన్యూ పనుల విషయమై ఎక్కడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీదేనని, ఈ విషయంలో అన్ని మండలాల తహశీల్దార్లను సమన్వయ పరిచి జిల్లాకి మంచి పేరుతీసుకు వచ్చేలా విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా గ్రామసచివాలయాల్లో అందే సేవలను మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రజలకు సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో మంత్రికి వివరించారు.