విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా కొటకల రాజేష్ ను నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అనుమతితో తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఐదేళ్లపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా మెరుగైన సేవలందించారు. గత రెండేళ్లుగా పినకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా రాజేష్ వైద్య సేవలందిస్తున్నారు.
ఈ మేరకు రాజేష్ సీనియారిటీ, పని అనుభవాన్ని గుర్తించి తాజాగా విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఇతర అధికారులు, వైద్యులు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ చెప్పారు.