సరుకుల పంపిణీకి ఇబ్బంది రాకూడదు..


Ens Balu
1
విజయనగరం
2021-05-04 15:12:10

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బుధ‌వారం నుంచి క‌ర్ఫ్యూ విధించిన నేప‌థ్యంలో నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని సంయుక్త క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశించారు.  ఎల్‌పిజి, పెట్రోలు బంకులు, రేష‌న్ షాపు డీల‌ర్లతో త‌న ఛాంబ‌ర్‌లో  మంగ‌ళ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా జెసి మాట్లాడుతూ నిత్యావ‌స‌రాల‌కు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌న్నారు. నిత్యావ‌స‌రాలు స‌ర‌ఫ‌రా చేసే వాహనాల‌కు ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయడం ద్వారా, పోలీసుల‌నుంచి ఎటువంటి ఇబ్బందులూ త‌లెత్త‌వ‌ని సూచించారు. వంట‌గ్యాస్‌, పెట్రోలు త‌గినంత స్టాకు ఉంచుకోవాల‌ని చెప్పారు. నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాలో గానీ, స‌రుకుల విక్ర‌యంలో గానీ త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జెసి కోరారు. ఈ స‌మావేశంలో డిఎస్ఓ పాపారావు, డిఎం సివిల్ స‌ప్ల‌యిస్ భాస్క‌ర్రావు, ఆయా సంఘాల ప్ర‌తినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు