అభివ్రుద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి...మంత్రి
Ens Balu
4
Visakhapatnam
2020-08-26 18:10:17
విశాఖ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. బుధవారం సీతమ్మధార క్యాంప్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, రోడ్లు భవనాలు, విద్యుత్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ద్వారా జిల్లాలో, భీమిలీ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ పర్యటన సమయంలో తెలుసుకున్న సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను గూర్చి చర్చించారు. విద్యుత్ సమస్యలు రాకుండా కొత్తగా ఆనందపురం మండలంలో 6, భీమిలీ మండలంలో 4, పద్మనాభం మండలంలో 11 వరకు నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియచేసారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి, విద్యుత్ సమస్యలు పై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.