సింహాద్రి నాధుని చందోనోత్సవానికి ఏర్పాట్లు..
Ens Balu
2
సింహాచలం
2021-05-05 10:22:13
విశాఖలోని సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈనెల 14న స్వామివారి చందనోత్సవం ఏకాంతంగా జరగనుంది. దానికోసం గందపు చెక్కలు సిద్ధమయ్యాయి. చందనం సాన ముహూర్తి 7వ తేదీ నుంచి చందనం తీయడం ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియ ఐదారు రోజులపాటు జరగనుంది. సుమారు 120 కేజీల చందనంలో సుగంధద్రవ్యాలను మిళితం చేసి స్వామివారికి సమర్పించడానికి చందనాన్ని సిద్దం చేస్తారు. స్వామివారి చందనోత్సవం రోజు స్వామి వారి వేసుకున్న చందనం తొడుగును వెండి బొరియలతో తొలగిస్తారు. ఆపై స్వామి ఉగ్రరూపాన్ని నిజరూప దర్శనంగా భక్తులకు కల్పిస్తారు. అరోజు నుంచి స్వామివారి శాంత పరిచేందుకు చందనం దఫ దఫాలుగా స్వామికి సమర్పిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమ శాస్త్రం ఆధారం నిర్వహించడానికి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.