కలెక్టర్ ఆదేశం ఎక్స్ రే యూనిట్ ప్రత్యక్షం..


Ens Balu
2
ఒంగోలు
2021-05-05 13:08:08

ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ కరోనా వైరస్ నియంత్రణలో అధికారులను అప్రమత్తం చేస్తూ..తాను స్వయంగా కోవిడ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ప్రజలకు సేవలందించడంలో ముందుంటున్నారు. బుధవారం ఒంగోలు కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ 500 పడకలు ఉన్న సమయంలో అత్యవసర సేవలకు ఎక్స్ రే మిషన్ లేని విషయాన్ని గుర్తించారు. అంతే ఆ విషయాన్ని  ఎస్సీ కార్పోరేషన్ ఈడి శ్రీనివాస విశ్వనాధ్ ను ఆదేశించడంతో ఆఘమేఘాలపై ఎక్స్ రే యూనిట్ ను కోవిడ్ కేర్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం కరోనా నియంత్రణకు సర్వ శక్తులు ఒడ్డుతోందని, మనం కూడా ప్రజలను కాపాడటానికి అన్ని అవకాశాలను వినియోగించుకొని సేవలు అందించాలని సూచించారు. ఎక్కడా వైద్యసేవలు, ఆక్సిజన్, బెడ్లు లేవనే ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. పారామెడికల్ సిబ్బంది, వైద్యులు మానవతా ద్రుక్పదంతో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకి రావాలి సూచించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..
సిఫార్సు