ఆ ఎంపీ కోటా కింద లెటరు ఇస్తే..కేంద్రీయ విద్యాలయంలో ఉచితంగా సీటు లభిస్తుంది.. వాస్తవంగా అయితే చాలా మంది ఎంపీలు ఈ అవకాశాన్ని పార్టీలో తమ కోసం పనిచేసిన కేడర్ కోసం వినియోగించి వారికి కేంద్రీయ విద్యాలయంలో చదివించే అవకాశం కల్పిస్తారు. కానీ రాజమండ్రి ఎంపీ భరత్ వినూత్నంగా ఆలోచించారు. తన కోటా కింద వచ్చే 10 సీట్లకు ప్రజల నుంచి దరఖాస్తులు కోరి వారి మద్యే డ్రా తీసి నిరుపేదలకు వాటిని అందించారు. ఎంపీ చేసిన ఈ ఉపకారంతో పది మంది నిరుపేద కుటుంబాల్లోని పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ మంచి కార్యక్రమానికి మార్గానీ ఎస్టేట్ వేదికైతే..వైఎస్సార్సీపీ నాయకులు, విద్యాలయంలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు సాక్షిగా మారారు. లక్కీ డ్రాలో సీటు పొందిన తల్లిదండ్రులంతా ఎంపీ భరత్ ను బాబూ నువ్వు చల్లగా ఉండాలి...పేదల కోసం విద్యా దానం చేసిన నీ మేలు మరిచిపోలేమంటూ బరువైన గుండెలతో..ఆనంద బాష్పాలతో దీవించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ, నేను ఎంపీగా మీ ఓటుతోనే గెలిచాను.. నేను మీకే సేవలు చేయాలి..అందుకే ఈ విధంగా సీట్లు డ్రా ద్వారా అందించాను. సీట్లు పొందిన వారంతా మంచి చదువులు చదువుకొని అభివ్రుద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రావు, వైఎస్సార్సీపీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి కానుబొయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు..