శ్రీకాకుళంలో ఈ నెల 8వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా వేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జి కె.జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ రాష్ట్రంలో ఈ నెల 8వ తేదీన జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా వేసినట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్ధ సభ్య కార్యదర్శి నుండి సమాచారం అందిందని పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తదుపరి ఉత్తర్వుల ఆధారంగా తెలియజేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. లోక్ అదాలత్ వాయిదా అంశాన్ని అధికారులు, కక్షిదారులు గమనించాలని ఆమె కోరారు.