తూ.గో.జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదు..


Ens Balu
2
కాకినాడ
2021-05-05 13:23:59

తూర్పుగోదావరి జిల్లాలో ఆక్సిజన్ సంబంధించి ఎక్కడా కొరత లేదని, రోగులకు అవసరమైనంత ఆక్సీజన్ అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు.  బుధవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఈఎన్టీ బ్లాక్ వద్ద ఉన్న కోవిడ్ వార్డులను జాయింట్ కలెక్టర్ (డి)కీర్తి చేకూరి , వైద్య అధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశ కోవిడ్ చాలా ఉధ్థృతంగా వ్యాపిస్తుదన్నారు. గతంలో 70% హోం ఐసోలేషన్ లోను,15% కొవిడ్
కేర్ సెంటర్ లోను,15%హాస్పిటల్ కి మాత్రమే ప్రజలు వచ్చే వారున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది ఆసుపత్రులకే వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలు అపోహలను విడిచిపెట్టి కోవిడ్ పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, రోగులకు రోజువారీ అవసరమైన ఆక్సిజన్  అందుబాటులో ఉందన్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఆక్సిజన్ను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నరన్నారు. ఆక్సిజన్ దుర్వినియోగం చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , ఇప్పటికే కొన్ని  ఆస్పత్రులపై చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సంబంధించి ప్రజల రద్దీని నివారించే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. డ్యూటీ డాక్టర్స్ వాహనాలు,అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలు మినహా ఇతరుల వాహనాలు జిజిహెచ్ లోపలకి రానివ్వకుండా చర్యలు చేపట్టలన్నారు. ఒక పేషెంట్ కి ఒక అటెండర్ మాత్రమే ఉండేవిధంగా పాసులు జారీ చేయబడతాయన్నారు. డిశ్చార్జి ప్రోటోకాల్ సంబంధించి  ఇద్దరు డాక్టర్లకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇక నుంచి కోవిడ్ సోకి, వైద్య సేవలు పొంది , ఆరోగ్యం నిలకడగా ఉన్న వారిని క్రమంగా డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. ఆక్సిజన్ అవసరం లేని వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు లేదా హోం ఐసోలేషన్ లో ఉండేవిధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ప్రజలు ఇప్పటికైనా మేల్కొనలి... కలెక్టర్.

   రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం వల్ల మాత్రమే కాకుండా కరోనా వైరస్ పట్ల ఇప్పటికైనా  అవగాహనతో, బాధ్యతాయుతంగా ప్రజలు వ్యవహరించాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 12 గంటలకు అత్యవసరాలకు  సంబంధించినవి తప్ప మిగిలినవన్నీ మూసి వేయడం జరుగుతుందని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటికి పరిమితం కావాలని కలెక్టర్ తెలిపారు.
     ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.పీ వెంకట బుద్ధ, ఆర్ యమ్ ఓ  డా ఇ. గిరిధర్, నోడల్ అధికారులు డా.ఎం కిరణ్, డా .హెచ్ విజయ్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు.
సిఫార్సు