విధుల్లోకి చేరిన జెసి జి.రాజకుమారి
Ens Balu
1
కాకినాడ
2021-05-05 13:27:50
తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా) జి.రాజకుమారి బుధవారం విధుల్లోకి చేరారు. ఏప్రిల్ 05 నుంచి 30వ తేది వరకు లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ,ముస్సోరి లో ఐఏఎస్ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని తిరిగి కాకినాడ చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల నుంచి 70 మంది ఐఎస్ లు ట్రైనింగ్ లో పాల్గొనగా ఈ ట్రైనింగ్ కాలంలో నిర్వహించిన అన్ని అంశాలలో మొదటి స్థానం సంపాదించిన జి రాజకుమారి ఉత్తమ ప్రతిభకు గాను ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా జేసి రాజకుమారి మాట్లాడుతూ 123వ ఇండక్షన్ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గతంలో కంటే మరింత అంకితభావం, సేవాభావంతో విధులు నిర్వర్తించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుంచేందుకు కృషి చేస్తానిని ఆమె తెలిపారు. ఈ శిక్షణ తనకు విధినిర్వహణకు ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు. నేటి నంచి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పాటు సంక్షేమ పథకాల పర్యవేక్షణ, కోవిడ్ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తానని జేసీ రాజకుమారి తెలిపారు.