ప్రజాసమస్య వేదికలుగా సచివాలయాలు నిలవాలి..మంత్రి


Ens Balu
4
Madhurawada
2020-08-26 18:44:19

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం విశాఖ  శిల్పరామంలో  సచివాలయం, వార్డ్ సిబ్బంది వాలింటర్స్   తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ముందుగా మదర్ థెరిస్సా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంతరం సమావేశంలో మంత్రి  మాట్లాడుతూ,  దేశంలోని ఎక్కడా లేని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమస్యల సత్వర పరిష్కరంకోసం సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు  చేశారని చెప్పారు.  ప్రభుత్వ పధకాలను వాలింటర్స్ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు.  వాలంటీర్లు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే చేరేందుకు వారధులుగా పనిచేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూతనంగా 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కె దక్కుతుందన్నారు. ఆయన పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే తక్షణమే చర్యలు తీసుకుంటామని,  లంచం తీసుకోవటం లంచం ఇవ్వటం నేరమేనని చెప్పే,  'దిశ’ తరహాలో అసెంబ్లీలో బిల్లు పెట్టబోతున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వాలింటర్స్, సచివాలయం సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బంది  , వార్డ్ వాలింటర్స్  సమస్యలు  తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో అధికారులు పంచాయతీ కార్యదర్శి లు, వాలింటర్స్, నాయకులు పాల్గొన్నారు.
సిఫార్సు