శుభకార్యాలకు 20 మందికే అనుమతి..
Ens Balu
1
విశాఖపట్నం
2021-05-06 01:56:45
కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదు అవుతున్న తరుణంలో శుభకార్యాలయాలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు విశాఖ అర్బన్ తహశీల్దార్ జ్నానవేణి తెలియజేశారు. గురువారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం గతంలో 50 మందితో కూడిన అనుమతులు శుభకార్యాలకు ఇచ్చేదని అయితే ఇపుడు ఆ సంఖ్యను తాజాగా కుదించారన్నారు. అనుమతులు కోరేవారు దరఖాస్తుతోపాటు కరోనా టెస్టులు చేయించుకున్న నెగిటివ్ రిపోర్టులను నాలుగు రోజులు ముందుగా సమర్పించాల్సి వుంటుందన్నారు. అనుమతులు మాత్రం నగర పరిధిలో సిటీ పోలీస్ కమీషనర్ జారీ చేస్తారని చెప్పారు. అందరూ ఒకే దగ్గర గుమిగూడి ఉండకూడదని.. సామాజిక దూరం పాటిస్తూ ప్రతీ ఒక్కరూ మాస్కులు ఖచ్చితంగా ధరించాలన్నారు. శానిటైజర్లు వినియోగించడం ద్వారా చేతిపై ఉంటే వైరస్ నాశనం అయ్యే అవకాశం వుంటుందని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా జారీచేసిన ఈ ఉత్తర్వులను అందరూ పాటించి కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.