ఉదయం 11.30 వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్లు..


Ens Balu
2
విజయనగరం
2021-05-06 07:59:58

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కోవిడ్ నియంత్ర‌ణంలో భాగంగా విధించిన క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఆదేశాల‌ను అనుస‌రించి జిల్లాలో భూ క్ర‌య‌, విక్ర‌య రిజిస్ట్రేష‌న్ స‌మ‌యాల్లో మార్పు చేసిన‌ట్లు జిల్లా రిజిస్ట్రార్ ఎం. సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విధించిన క‌ర్ఫ్యూలో భాగంగా ఈ నెల 5వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల వ‌ర‌కే రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు పని చేస్తాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి త‌దుప‌రి ఆదేశాల వ‌చ్చే వ‌ర‌కు జిల్లాలోని రిజిస్ట్రార్‌, స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. 

సిఫార్సు