రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్ మిల్ నుంచి 10 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నుంచి కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయాలని
ఎంపీ, వైయస్సార్సీపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఎంపీ సూచన మేరకు యాజమాన్యం ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీనితో రాజమహేంద్రం వరం నుంచి ఆక్సిజన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు పేపర్ మిల్ యాజమాన్యంతో ముందుకు వచ్చింది. రోజుకు పది టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తామని యాజమాన్యం ఎంపీకి తెలియజేసింది. దీనితో ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కొరత తీర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంపీ భరత్ తెలియజేశారు.