కోవిడ్ కంటైన్మెంటు జోన్లలో పర్యవేక్షణకు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని మేపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. కంటైన్మెంటు జోన్లను పకడ్బందీగా నిర్వహించాలని, కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. గురువారం మండల ప్రత్యేక అధికారులు, వైద్య శాఖ అధికారులు, వైద్య అధికారులతో టెలీ కాన్ఫరెన్సును కలెక్టర్ నిర్వహించారు. ఒక సచివాలయ ఉద్యోగికి కనీసం ముగ్గురు వాలంటిర్లను మ్యాప్ చేయాలని, ఆ ముగ్గురు పనులను సచివాలయ ఉద్యోగి పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి రోజూ ఆర్.డి.ఓలు, సంబంధిత సర్విలెన్స్ అధికారులు, ఎం.పి.హెచ్.ఏలతో చొప్పున సమీక్షించాలని ఆయన ఆదేశించారు. ప్రతి కంటైన్మెంట్ జోన్ లో ఒక సచివాలయ ఉద్యోగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హై పాజిటివిటీ నమోదు అవుతున్న మండలాలలో రెండు వందలకు తగ్గకుండా టెస్టులు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి పట్టణ ప్రాంతంలో రెండు వందల నుండి 250 కి తగ్గకుండా టెస్టులు చేయాలని పేర్కొన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ జరగాలని, వాటిని యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గరోడా, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఐ.కిషోర్, టి.వి.ఎస్.జి.కుమార్ తదితరులు పాల్గొన్నారు.