కరోనాను రూపుమాలంటూ వినాయకునికి పూజలు..వంశీ


Ens Balu
4
Visakhapatnam
2020-08-26 18:59:01

కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలంటూ వైఎస్సార్సీపీ విశాఖ నగర్ అధ్యక్షులు సీహెచ్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీవకోటి విఘ్నాలు తీర్చే గణపతి, కరోనా వైరస్ ను నియత్రిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ను పూర్తిగా రూపుమాపాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ప్రజలంతా స్వచ్చందంగా కరోనా నియంత్రణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్పా ఇతర సమయాల్లో బయటకు రాకూడదన్నారు. చిన్నపిల్లలను, ముసలి వారిని జాగ్రత్త చూడాలన్న వంశీ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వైద్యఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించాలన్నారు.
సిఫార్సు