ప్రజలు అప్రమత్తతో కరోనా కట్టడి సాధ్యం..


Ens Balu
2
విశాఖపట్నం
2021-05-07 01:57:17

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలు పాటిస్తే కరోనా నియంత్రణ త్వరలోనే సాధ్యపడుతుందని విశాఖ అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్పా ఎవరూ బయటకు రావొద్దని చెబుతున్నారు. ఈ సందర్భంగా విశాఖలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఫాక్షిక కర్ఫ్యూ కి ప్రజలు సహకరించాలని కోరారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచి తెల్లవారు జాము ఆరు గంటల వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూనిఅన్ని వర్గాలు పాటించాలన్నారు. ప్రభుత్వం ఎన్నో వ్యవయప్రయాసలకోర్చి చేస్తున్న సేవలను ప్రజలు గమనించాలని కోరారు. బయటకు వెళ్లే సమయంలో కూడా గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ పనులు చూసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలన్నారు. ఎవరికైనా ప్రభుత్వం సూచించిన అంశాల్లో ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకొని కోవిడ్ కేర్ సెంటర్లు లేదా, హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్సలు పొందాలన్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండి..సహకరిస్తే అంతే త్వరగా కరోనా వైరస్ ను విశాఖలో శతశాతం తగ్గించడానికి అవకాశం వుంటుందన్నారు. ఇటు సిబ్బంది కూడా  ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలంటే అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఖచ్చితంగా 45 సంవత్సరాలు దాటిన వారంతా కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని, మొదటి డోసు వేయించుకున్నవారు రెండవ డోసు కూడా వేయించుకోవాలని తహశీల్దార్ జ్నానవేణి కోరారు.

సిఫార్సు