ఆక్వా రైతుల‌కు క‌ర్ఫ్యూ పాసులు..డిడి నిర్మలకుమారి


Ens Balu
1
విజయనగరం
2021-05-07 07:57:26

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్న నేప‌థ్యంలో,  ఆక్వా రైతులు, సంబంధిత కార్య‌క‌లాపాలు చేసేవారు త‌ప్ప‌నిస‌రిగా క‌ర్ఫ్యూ పాసుల‌ను తీసుకోవాల‌ని మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు నిర్మ‌లాకుమారి సూచించారు.  శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, త‌మ శాఖ ద్వారా ఆర్‌డిఓలు లేదా తహశీల్దార్ల‌ నుంచి ఈ పాస్‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నియంత్రణ అధికంగా వుంటుందన్నారు. ఈ తరుణంలో ఆక్వా రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ పాసులను జారీచేస్తుందన్నారు. షాపుల‌ను మూసివేయిస్తుండ‌టం వ‌ల్ల‌, ఆక్వా రైతులు, వ్యాపారులు, ల్యాబ్ య‌జ‌మానులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ య‌జ‌మానులు త‌మ రాక‌పోక‌లు సాగించేందుకు ఈ పాసులు ఉపయోగపడతాయన్నారు.
సిఫార్సు