ప్రజల రక్షణార్ధం నిత్యం రైతుబజార్లు శానిటైజేషన్..
Ens Balu
1
సీతమ్మధార
2021-05-07 09:02:53
విశాఖ అర్భన్ లోని ప్రజల రక్షణార్ధం సీతమ్మధార మండలం పరిధిలో రైతుబజార్లను కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం శానిటైజేషన్ చేస్తున్నట్టు తహశీల్దార్ జ్నానవేణి తెలియజేశారు. శుక్రవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నిత్యవసర సరుకులకు ఇబ్బంది లేకుండా క్రిష్ణాకాలేజీ మైదానం, హెచ్ బి అబ్దుల్ కలాం పార్కు, నర్సింహనగర్ డిఎల్భీ గ్రౌండ్ లలో రైతు బజార్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇరుకుగా ఉండే సీతమ్మధార రైతు బజార్ ను తాత్కాలికంగా మూసివేసినట్టు వివరించారు. జెసి ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తహశిల్దార్ వివరించారు. కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి వీటిని కూడా ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నాం 12వరకూ మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని తహశిల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.