సచివాలయ నియామక పరీక్షలకు సిద్ధం కావాలి..కమిషనర్
Ens Balu
4
Visakhapatnam
2020-08-26 19:24:34
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకం కోసం సెప్టెంబర్ 20 నుంచి చేపట్టబోయే పరీక్షలకు అధికారులు సంసిద్ధం కావాలని జి.వి.యం.సి కమిషనర్ డాక్టర్ జి .సృజన అన్నారు. బుధవారం ఈ నియామక పరీక్షల పై పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, గ్రామ/ వార్డు సచివాలయం నియామక పరీక్షలకు క్లస్టర్ ఆఫీసర్లను, రూట్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని, విశాఖపట్నంలో 163 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.ముఖ్యంగా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి దృష్ట్యా, ఈ సంవత్సరం నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందస్తు జాగ్రత్త/అవగాహన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ లు ఏర్పాటు చేయాలని, 6 అడుగుల బౌతిక దూరం ప్రతి ఒక్కరూ పాటించే టట్లు వారికి అవగాహన పరచాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలలో కోవిడ్ లక్షణాలు కనిపించిన అభ్యర్థులను గుర్తించి ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి అక్కడే వారికి వ్రాత పరీక్ష నిర్వహించుటకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.